Srisailam Dam: శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు.. అబ్బురపరచే జలదృశ్యం - శ్రీశైలం డ్యామ్
🎬 Watch Now: Feature Video
శ్రీశైలం జలాశయాని(Srisailam Dam)కి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను... 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 207.4103 టీఎంసీల వద్ద ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.