sikh pooja at bhagyalakshmi temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద సిక్కుల పూజలు - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
దీపావళిని పురస్కరించుకుని చార్మినార్ భాగ్యలక్ష్మి(sikh pooja at bhagyalakshmi temple) అమ్మవారి ఆలయం వద్ద సిక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయం వద్ద పూజలు చేసిన సిక్కులు... అనంతరం విన్యాసాలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో కత్తులతో విన్యాసాలు చేశారు. దీపావళి అనంతరం మూడో రోజు చార్మినార్ వద్ద విన్యాసాలు చేయటం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. సిక్కుల విన్యాసాలు తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.