ఐదేళ్ల తర్వాత సల్వా పేటు జలపాతం పరవళ్లు - ఉదయగిరి పట్టణం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9714700-21-9714700-1606734660722.jpg)
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం సమీపంలోని దుర్గం కొండపై నుంచి జాలువారుతూ.. సల్వా పేటు జలపాతం కనువిందు చేస్తోంది. నివర్ తుపాను ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురవటం వల్ల దాదాపు 5 ఏళ్ల తర్వాత సల్వా పేటు జలపాతం పర్యటకులను అమితంగా ఆకర్షిస్తోంది. జలపాత సోయగాన్ని తిలకించేందుకు ఉదయగిరితో పాటు పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు దుర్గం కొండపైకి అధిక సంఖ్యలో వస్తున్నారు.