PRATHIDWANI: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎవరి వాదన వారిదే.. - ఈటీవీ భారత్ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వేర్వేరు వాదనలు రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. పండిన పంటనంతా పూర్తిగా కొంటామని ఒకరు, లక్ష్యానికి మించి కొనేదిలేదని మరొకరు రైతులకు చెప్తున్నారు. ఈ ప్రకటనలకు అనుగుణంగానే భాజపా, తెరాస పార్టీలు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే.. క్షేత్ర స్థాయిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.