Prathidhwani: ఎన్నికల్లో నేర చరితుల చిట్టా విప్పరెందుకు? నియమావళి ఏం చెబుతోంది?
🎬 Watch Now: Feature Video
దేశంలో నేరాలు, రాజకీయాలు కలిసిచేస్తున్న ప్రయాణం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారింది. ఈ అపకీర్తిని తుడిచిపెట్టేందుకు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినా లక్ష్యపెట్టని పార్టీలు వందల సంఖ్యలో నేర చరితులకు టిక్కెట్లిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న పార్టీలపై కఠిన చర్యలు తీసుకోక తప్పదంటూ హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో నేర చరితులను పార్టీలు ఎందుకు అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి? ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే పార్టీలపై చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.