ప్రతిధ్వని : వ్యవసాయ బిల్లులతో రైతులకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి? - ప్రతిధ్వని ఈరోజు చర్చ సమాచారం
🎬 Watch Now: Feature Video
వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన సందర్భంలో రాజ్యసభ రణరంగాన్ని తలపించింది. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని లేదా సెలక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మూజువాణి ఓటుతో ఆ బిల్లులను ప్రభుత్వం నెగ్గించుకుంది. వ్యవసాయ బిల్లులను రైతుల పాలిట మరణ శాసనాలుగా కాంగ్రెస్ విమర్శించింది. రైతుల శ్రేయస్సే ఆ బిల్లుల ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన సంస్కరణలతో రైతులకు సాధికారత లభిస్తుందని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ బిల్లులతో రైతులకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి? వాటి వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను ప్రభుత్వం చట్ట సభల్లో ఎందుకు స్పష్టంగా వివరించలేక పోయింది? గందరగోళ పరిస్థితుల్లో ఎందుకు నెగ్గించుకోవాల్సి వచ్చింది? లాంటి అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.