ప్రతిధ్వని: జీఎస్డీపీ నష్టానికి రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలేంటి?
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభం కారణంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కోట్లకుపైగా.. జీఎస్డీపీని నష్టపోనున్నాయని ఎస్బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 లక్షల 53 వేల 923 కోట్లు.. తెలంగాణ రాష్ట్రం 2 లక్షల 53 వేల 512 కోట్లకుపైగా నష్టపోనున్నట్లు తెలిపింది. ఈ ప్రభావం రాష్ట్ర వృద్ధి రేటుపై తీవ్రంగా పడుతుంది. జీఎస్డీపీ తగ్గితే ఎఫ్ఆర్బీఎం ప్రకారం బహిరంగా మార్కెట్ నుంచి తీసుకునే రుణం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు జీఎస్డీపీ లోటు భర్తీకీ రాష్ట్రాలే అప్పులు చేసుకోవాలని కేంద్రం అంటోంది. ఈ నేపథ్యంలో జీఎస్డీపీ నష్టంపై రాష్ట్రాలు తీసుకోవాల్సిన ఉద్దీపన చర్యల గురించి ఈనాటి ప్రతిధ్వని చర్చ.