ప్రతిధ్వని : భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు
🎬 Watch Now: Feature Video
సుస్థిర అభివృద్ధి సాధనలో ముందడుగేస్తున్న భారత్కు కరోనా మహమ్మారి భారీ గండి కొట్టింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, సంక్షేమం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం వంటి అంశాల్లో ఐదేళ్లలో సాధించిన ప్రగతిని కరోనా సంక్షోభం తుడిచిపెట్టింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా దెబ్బ తీవ్రస్థాయిలో పడింది. అన్ని రంగాలు కుప్పకులుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం మరింత పెరిగిపోతోంది. కరోనా వర్తమానాన్నే కాదు భారత భవిష్యత్తును కాటేస్తోంది. జీడీపీలో అదనంగా 6.2 శాతం వెచ్చిస్తేనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని నీతి అయోగ్ చెబుతోంది. ఈ నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి, కరోనా సవాళ్లపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.