PRATHIDWANI: 'దక్షిణాదికి అన్యాయం' ఇంకెన్నాళ్లు..? - దక్షిణాదికి అన్యాయంపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
"దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది". కేటాయింపుల నుంచి అభివృద్ధి ప్రాజెక్టుల వరకు.. తరచూ వినిపించే విమర్శ ఇది. 'అభివృద్ధి లక్ష్యాలు అందుకుంటున్న రాష్ట్రాలను జనాభా పేరుతో శిక్షిస్తారా...? సమతుల్యత పాటించాల్సిన అవసరముంది. లేదంటే మున్ముందు అన్ని రాష్ట్రాలూ లక్ష్యాల సాధన పక్కన పెడతాయి'' అని దక్షిణాది ముఖ్యమంత్రులు, నాయకులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లు కనిపించడం లేదు. మొన్నటికి మొన్న.. 15వ ఆర్థిక సంఘం కేంద్రంగా ఇదే విషయంపై రేగిన దుమారం చూశాం. ఇప్పుడు రాజకీయ ప్రాతినిథ్యం వంతు వచ్చింది? రానున్న రోజుల్లో అదే జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టమే అందుకు కారణం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.