Prathidwani: కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతలేంటి? - కేంద్ర బడ్జెట్ 2022
🎬 Watch Now: Feature Video
Union Budget 2022: కొవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత రెండో బడ్జెట్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. వరుస లాక్‌డౌన్లు, ఆంక్షల నడుమ పారిశ్రామిక, వ్యాపార- వాణిజ్య రంగాలు చితికిపోయాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయం, స్టార్టప్స్ రంగాలు స్థిరంగా నిలదొక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్ అంచనాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ఏఏ రంగాలకు ప్రాధాన్యం ఇస్తుంది.? గతేడాది ప్రకటించిన ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను ఏ మేరకు ఆదుకున్నాయి? ఈ బడ్జెట్‌లో జనజీవనానికి భరోసా కల్పించే ఆర్థిక ప్రకటనలు ఏముంటాయి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.