ప్రతిధ్వని: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల తీరుతెన్నులను ప్రభుత్వం పరిశీలిస్తోందా ? - prathidwani debate on tution fees
🎬 Watch Now: Feature Video
కరోనా కాలంలోనూ ప్రైవేటు పాఠశాలలు ఆధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు పెరిగాయి. అసలే ఉపాధి లేక, ఆదాయాలు పడిపోయి కష్టంగా కుటుంబాలు నెట్టుకొస్తున్న సామాన్యులు.. ప్రైవేటు పాఠశాలల ఫీజుల ఒత్తిడిని భరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 75ను విడుదల చేసింది. నెలవారీగా ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ ప్రైవేటు పాఠశాలలకు దిశానిర్దేశం చేసింది. అయితే.. ట్యూషన్ ఫీజుల నిర్ణయం, దాని పరిధిలోకి వచ్చే అంశాలపై చాలామంది తల్లిదండ్రులకు స్పష్టత లేదు. ఈ పరిస్థితి పాఠశాలల యాజమాన్యాలకు వరంగా మారింది. అసలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విధానం ఎలా నిర్ణయిస్తారు? ఫీజుల వసూళ్లలో అవకతవకలపై తల్లిదండ్రులు ఎవరికి ఫిర్యాధు చేయాలి? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల తీరుతెన్నులను ప్రభుత్వం పరిశీలిస్తోందా ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.