పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడు - thirumala latest news
🎬 Watch Now: Feature Video

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనసేవైన పెద్దశేష వాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చిన పెద్దశేష వాహనాన్ని పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో అలంకరించారు. ఉభయదేవేరులతో కలిసి ఏడుతలల శేషవాహనంపై గోవిందరాజస్వామి అవతారంలో అభయప్రదానం చేశారు. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు.