Peacock : నయనానందకరం.. నెమలి నాట్యం - peacock dance in peddapalli
🎬 Watch Now: Feature Video
వర్షాలతో రాష్ట్రమంతా ఆహ్లాదకరంగా మారింది. ఎటుచూసినా పరవళ్లు తొక్కే జలపాతాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులతో ప్రకృతి పులకరిస్తోంది. చిరుజల్లులు పడుతున్నా.. జలపాతాలు చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామునిగుండాల ప్రాంతం నయనానందకరంగా మారింది. ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లిన సందర్శకులకు అక్కడ.. పురివిప్పి నాట్యమాడుతున్న మయూరాలు కనువిందు చేశాయి. ఆ దృశ్యాలను వారు కలకాలం పదిలంగా దాచుకునేందుకు తమ కెమెరాల్లో బంధించారు.