painting exhibition: ఊహకు ప్రాణం పోసి... కుంచెతో బొమ్మను గీసి.. - మాదాపూర్లో పెయింటింగ్ ఎగ్జిభిషన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13025951-356-13025951-1631274704935.jpg)
హృదయాంతరంగాల్లో చెలరేగే అలజడి.... ఉప్పొంగే భావోద్వేగ కేరటాలు... మదినిండా పులుముకొనే రంగుల చిత్రాలు వీక్షకులను మంత్రముగ్థులను చేస్తున్నాయి. పలువురు యువ చిత్రకారుల కుంచె నుంచి జాలువారే కళారూపాలు మదిని కొళ్లగొడుతున్నాయి. శూన్యంతో నిండి ఉన్న మనస్సును రంగులతో ముంచెత్తుతాయి, ఆహ్లాదభరతమైన అనుభూతిని అందిస్తాయి. వీక్షిస్తుంటే మనస్సు హాయిగా, ప్రశాతంగా సేదదీరుస్తాయి. జాపపదాల వైభవం, ఆధ్యాత్మిక చింతన, చారిత్రక కట్టడాల సోయగం, తెలంగాణ ప్రజల జీవన విధానం ఇలా ఎన్నో కళారూపైలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అద్భుత చిత్రాల ప్రదర్శకు వేదికగా నిలుస్తోంది.