నిట్‌లో అలరించిన వసంతోత్సవ వేడుకలు - వరంగల్ నిట్
🎬 Watch Now: Feature Video
వరంగల్‌లోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(నిట్) లో స్ర్పింగ్ స్ప్రే వసంతోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సూక్ష్మ కళాకారుడు మట్టెవాడ అజయ్‌కుమార్ సూది బెజ్జంలో రూపొందించిన గణపతి, గౌతమ బుద్ధుడు, చార్లీచాప్లిన్, రామచిలుక, సంగీత వాయిద్యాల సూక్ష్మ కళా ఖండాలను ప్రదర్శించారు. కరీంనగర్‌కు చెందిన హరిప్రసాద్ అగ్గిపెట్టెలో పట్టే విధంగా తయారుచేసిన చేనేత చీరను ప్రదర్శించారు. నిట్ సంచాలకులు ఎన్వీ రమణారావు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కె.రామాచారి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.