రాశిఫలం: కర్కాటక - ఉగాధి రాశి ఫలాలు
🎬 Watch Now: Feature Video
ఆదాయం: 11, వ్యయం: 8, రాజపూజ్యం: 5, అవమానం: 4
కర్కాటక రాశివారు... సాంకేతిక వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ఉన్న ద్వేషం.. మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. ఈ రాశివారు కలలు కన్న.. గమ్యాన్ని చేరుకుంటారు. సాహిత్యం, విద్య, పరిశోధన రంగంలో చేసిన కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆపదలో తప్పుకుంటే.. మిగిలేది అదృష్టమే అని గుర్తుంచుకోవాలి. స్థిరాస్తుల వ్యవహారంలో పెద్దలు అనుకూలంగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు మీకు లాభిస్తాయి. ప్రతి చిన్న విషయంలో పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యమవుతుంది. జీవితం భాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. ఇలా చాలా కీలకమైన విషయమని గుర్తించాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి.. మంచి ఉద్యోగం సాధిస్తారు. దూర ప్రాంతాల్లోని మీ వారు ఆర్థికంగా సహాయపడి అండగా నిలుస్తారు. ఉద్యోగం వచ్చేవరకూ మిమ్మల్ని కుటుంబ సభ్యులు పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని హామీ ఇస్తారు. వ్యక్తిగత, వృత్తిపరమైన రహస్యాలు బయటకు వారికి తెలుస్తాయి. అదీ మీ నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది.
Last Updated : Mar 25, 2020, 11:49 AM IST