ఈటీవీ భారత్‌కు ఐబీసీ ఇన్నోవేషన్ పురస్కారం - IBC AWARD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4552841-729-4552841-1569422369212.jpg)
డిజిటల్ పాత్రికేయ రంగంలో దూసుకెళ్తోన్న ఈటీవీ భారత్‌ను.. ప్రతిష్ఠాత్మక 'ఐబీసీ ఇన్నోవేషన్ పురస్కారం-2019' వరించింది. విస్తృత స్థాయిలో తాజా వార్తలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు గాను ‘'కంటెంట్ ఎవ్రీవేర్'’ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఫేస్‌బుక్ సహా దాదాపు 180 మీడియా సంస్థలు పోటీపడినా.. ఈటీవీ భారత్ విజేతగా నిలిచింది. ఆంస్టర్‌డ్యాంలో జరిగిన కార్యక్రమంలో ఈటీవీ భారత్ తరఫున సాంకేతిక భాగస్వామి ఎవెకో సీఈవో పావెల్ ఈ అవార్డును అందుకున్నారు. ఇవాళ రామోజీ ఫిలింసిటీలో.. అవార్డును రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావుకు అందించారు ఎవెకో సీఈవో పావెల్.
రామోజీ గ్రూపు విభాగంగా ఈ ఏడాది మార్చి 21న ప్రారంభమైన ‘ఈటీవీ భారత్’ విస్తృతంగా ప్రజాదరణను పొందుతూ.. విశ్వసనీయ వార్తలకు చిరునామాగా నిలుస్తోంది. ఆంగ్లంతో సహా 13 భారతీయ భాషల్లో.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను క్షణాల్లో ప్రజల ముందుకు తీసుకొస్తోంది ఈటీవీ భారత్.