Heavy Rains in Tirumala: తిరుమల- తిరుపతిలో కుంభవృష్టి... ముంచెత్తిన వానలు - తిరుమల - తిరుపతిలో కుంభవృష్టి
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాలకు తిరుపతి అతలాకుతలమైంది. శేషాచల కొండలపై నుంచి వస్తున్న వరద నీటితో నగరం నీట మునిగింది. ఎటుచూసినా నీటితో.. చెరువును తలపిస్తోంది. వరద నీరు పెద్దఎత్తున రహహదారులను ముంచెత్తింది. కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మూగ జీవాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. చరిత్రలో ఎప్పుడూ చూడనంత వరద నీరు తిరుపతి వీధుల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అటు తిరుమలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆలయ పరిసరాలన్నీ నీట మునిగి.. చెరువును తలపిస్తోంది. కనుమదారుల్లో వరద నీరు జలపాతాలను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిపివేశారు.