Veerabhadra swamy brahmotsavam : వైభవంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం - తెలంగాణ దేవాలయాలు
🎬 Watch Now: Feature Video

veerabhadra swamy brahmotsavam : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, వీరభద్ర స్వామి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వీరభద్రస్వామి అవాహనతో వీరముచ్చు వంశస్థులు డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. త్రిశూలేశ్వరుని సహితంగా పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తే... శత్రుపీడ, శరీరపీడ, రోగ బాధలు తొలగిపోతాయని వేదపండితులు తెలిపారు.