ప్రతిధ్వని: కరోనా వ్యాప్తికి ముందున్న స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరాలంటే..? - ఆర్థిక వ్యవస్థ పతనంపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభానికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అమెరికా, మెక్సికో, జర్మనీ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరిగిపోతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 33 శాతం వార్షిక రేటుతో క్షీణించింది. ఒక త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా పడిపోవడం అగ్రరాజ్యం చరిత్రలో తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఎన్నడూ లేనంతగా తక్కువ వృద్ధిరేటు నమోదవుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలపై కరోనా ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. కొవిడ్ వ్యాప్తికి ముందున్న స్థాయిని అందుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ.