PRATHIDWANI: తెలంగాణ చరిత్రలో ఆరోజు జరిగిందేంటి? ప్రాణాలకు తెగించి ప్రజలెందుకు పోరాడారు? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా
🎬 Watch Now: Feature Video
ఆగస్టు 15, పందొమ్మిది వందల నలభై ఏడున భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశత్వంలోనే మగ్గిపోయారు. నిజాం పోలీసులు, రజాకార్ల మూకలు, దొరలు- భూస్వాముల గూండాలు... కలిసి సాగించిన కూృరమైన హింసలకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజలు సాయుధులై తిరుగుబాటు చేశారు. సామాన్యుల వీరోచిత పోరాటాలకు, అసమాన ధైర్య సాహసాలకు మద్దతుగా భారత సైన్యం నిజాం సంస్థానాన్ని చుట్టుముట్టింది. ఒకవైపు రైతుల సాయుధ పోరాటం... ఇంకొక వైపు యూనియన్ సైన్యాల చక్రబంధం. మధ్యలో చిక్కుకున్న నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తోకముడిచి లొంగిపోయిన చారిత్రక దినం సెప్టెంబర్ 17పై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.