ప్రతిధ్వని: కరోనాపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పోరు ఏంటి? - corona debate latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7631017-thumbnail-3x2-prathi.jpg)
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. కరోనా కేసుల సంఖ్య మూడు లక్షల దాటి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. మరోవైపు రికవరీ 50 శాతం దాటడం.. మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాదు.. వైద్యులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు అందరూ వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో దాదాపు 45 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాధికి గురవుతున్నారు. గమనించేలోపే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు వ్యాపిస్తున్నాయి. కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హోం క్వారంటైన్లో ఉండే వారి సంఖ్య అధికం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ దిశగా ఎలాంటి ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలనే అంశంపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jun 26, 2020, 6:01 PM IST