రైతు బంధు సంబురం.. కూరగాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం - ఖమ్మం జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video

CM KCR Picture with vegetables : రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో రైతు బంధు సంబురాలను అన్నదాతలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌లో కూరగాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని ఆవిష్కరించారు. 18వందల చదరపు అడుగుల విస్తర్ణంలో తీర్చిదిద్దిన చిత్రం ఆకట్టుకుంటోంది. 15 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు, 4క్వింటాళ్ల టమాటా, వంకాయలు, దొండకాయలు ఇతర కూరగాయలు వాడి చిత్రాన్ని రూపొందించారు. కూరగాయలతో కేసీఆర్ చిత్రం ఆకట్టుకునేలా ఉంది.