పొగమంచు కురిసింది.. ప్రకృతి అందాలతో రైల్వే కోడూరు మెరిసింది..!
🎬 Watch Now: Feature Video
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రైల్వేకోడూరులో కోనసీమ అందాలను తలపించే విధంగా ఉదయం 10 గంటల వరకు అంతా మంచు దుప్పటి కప్పినట్లుగా ఉంది. చలి తీవ్రత ఎక్కువ అవడం వల్ల వేకువజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బంది పడ్డారు. మనిషికి మనిషి కనపడనంతగా పొగమంచు కమ్మేసింది. ఫలితంగా పరిసరాలన్నీ శీతల దేశపు ప్రాంతాలుగా మారిపోయాయి.