కృష్ణానదిలో చిక్కుకున్న లారీలు.. - lorries stucked in krishna river in ap
🎬 Watch Now: Feature Video
ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామలో.. కృష్ణానదిలో అకస్మాత్తుగా పెరిగిన వరదలో 70 ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం వందకు పైగా లారీలు వెళ్లాయి. అకస్మాత్తుగా వరద రావడం వల్ల వరద నీటిలో 70 లారీలు నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరద నీటికి కొట్టుకుపోవడం వల్ల వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.