నీటి అడుగున హాకీ... అదిరిపోయింది - water
🎬 Watch Now: Feature Video
హాకీ.. ఆడాలంటే సాధారణంగానే కొంచెం కష్టం. అలాంటిది నీటి అడుగున హాకీ ఆడుతున్నారు రష్యావాసులు. గత వారం మాస్కోలో అండర్ వాటర్ హాకీ ఛాంపియన్షిప్ జరిగింది. సాధారణ హాకీలాగే రెండు జట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఉంటారు. అవసరమైతే అదనపు క్రీడాకారులనూ తీసుకోవచ్చు. ఆక్సిజన్ సిలిండర్లతో నీటి అడుగున ఆడే ఈ ఆట చూపరులను ఆకట్టుకుంది.