ముద్దిచ్చి.. ఆపై బిందిచ్చిన పూజా హెగ్డే - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
🎬 Watch Now: Feature Video
అలనాటి సినీనటులు శోభన్ బాబు, శ్రీదేవి నటించిన 'దేవత' చిత్రంలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేసింది వాల్మీకి చిత్ర బృందం. ఈ సాంగ్కు కొత్త హంగులు జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఇప్పటికే పూర్తయిన పాటను.. మంగళవారం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ప్రత్యేకంగా చూపించారు. అద్భుతంగా చిత్రీకరించారని చిత్రబృందాన్ని ప్రశంసించారు మెగా డైరెక్టర్. కార్యక్రమం చివర్లో నటి పూజాహెగ్డే ఆయనకు విభిన్నంగా ఓ బిందెను బహూకరించింది. సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Oct 1, 2019, 12:41 AM IST