వినాయక్ చేతుల మీదుగా 'విట్టల్ వాడి' ట్రైలర్ విడుదల - తెలుగు సినిమా వార్తలు
🎬 Watch Now: Feature Video
నూతన నటీనటులు రోహిత్, సుధా రావత్ జంటగా ఎన్ఎన్ ఎక్స్పీరియన్స్ పతాకంపై నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం 'విట్టల్ వాడి'. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన వినాయక్... హీరో రోహిత్‌కు చక్కటి భవిష్యత్ ఉందని తెలిపారు. విట్టల్ వాడి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.