సిగరెట్‌పై 7186 అక్షరాలు రాసి యువకుడి రికార్డ్ - ధూమపానం ఆరోగ్యానికి హానికరమని రాసి రికార్డ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక రామనగరలో ఓ యువకుడు సిగరెట్‌పై పొగాకు వ్యతిరేక సందేశాన్ని రాసి రికార్డు సృష్టించాడు. చన్నపట్న తాలూకా మట్టికెరె గ్రామానికి చెందిన ఎంఎస్ దర్శన్ గౌడ అనే యువకుడు సిగరెట్‌పై 260 సార్లు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అదే సిగరెట్‌పై 80 సార్లు ఇండియా అని కూడా రాశాడు. ఇలా మొత్తం 7వేల 186 అక్షరాలు 6.9 సెంటీమీటర్ల సిగరెట్‌పై రాశాడు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని కోరేందుకే ఇలా చేసినట్లు చెప్పాడు దర్శన్ గౌడ.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST