Bhadrachalam: 'తాతా ఏటీఎంలో నుంచి నేను డబ్బు తీసిస్తా ఆగు'.. అంటూ
🎬 Watch Now: Feature Video
Man steals money from old man in Bhadrachalam: ఏటీఎం నుంచి వృద్ధుడికి నగదు తీసిస్తానని చెప్పి కార్డు మార్చి రూ.3లక్షలు కాజేశాడు ఓ యువకుడు. భద్రాచలంలోని ఎంపీ కాలనీకి చెందిన నారాయణ అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్ వద్ద గల ఏటీఎంకు నగదు డ్రా చేయడానికి వెళ్లాడు. తనకి ఏటీఎం గురించి తెలియకపోవడంతో పక్కనే ఉన్న యువకుణ్ని నగదు డ్రా చేయడానికి సాయం కోరాడు. వృద్ధుడికి ఏటీఎంపై అవగాహన లేదని గుర్తించిన యువకుడు నగదు డ్రా చేసి ఇచ్చాడు.
అయితే ఆ తర్వాత ఆ వృద్ధుడికి వేరే ఏటీఎం కార్డు ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి అతడి ఖాతాలో నుంచి నగదు స్వాహా చేస్తూ వచ్చాడు. నారాయణ కుమారుడు ఒకరోజు ఏటీఎం చూడగా.. అది మారినట్లు గుర్తించాడు. ఖాతాలో చూస్తే రూ.3 లక్షలు మాయమయ్యాయి. ఏమైందని తన తండ్రిని ఆరా తీస్తే.. చివరగా తాను ఓ యువకుడి సాయంతో ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన విషయం చెప్పాడు.
విషయం అర్థమైన నారాయణ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్ షాద్‌నగర్‌లో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు పలు దఫాలుగా కార్డుతో షాపింగ్‌లు, సామగ్రి విక్రయాలు చేసినట్లుగా సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు.