Young Man Made Electric Tractor In Peddapalli : ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త ఉపాయం.. ఎలక్ట్రిక్​ ట్రాక్టర్​ తయారుచేసిన శశిరథ్ రెడ్డి - దేశంలోనే మొదటి ఎలక్ట్రిక్​ ట్రాక్టర్​ తయారీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 3:46 PM IST

Young Man Made Electric Tractor In Peddapalli : చిన్నప్పటి నుంచి మోటార్​ వెహికల్స్​ అంటే అతడికి చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే మెకానికల్​ ఇంజినీరింగ్​ చేశాడు. అదే సమయంలో ఇంధన ధరలు పెరిగి, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని గమనించాడు. రైతుకు ఖర్చును తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఓ వినూత్న ఆవిష్కరణకు పూనుకున్నాడు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత అందులో సక్సెస్​ సాధించాడు. ఆ వ్యక్తే పెద్దపల్లి జిల్లా నాగారంకు చెందిన శశిరథ్​​ రెడ్డి. అది కూడా దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఆవిష్కరణను చేశాడు. 

Sasirath Reddy Who Made Electric Tractor : వాహనాల తయారీపై ఉన్న మక్కువతో 18 లక్షల రుణం తీసుకొని బ్రిటన్​ వెళ్లి మరీ చదువుకొని.. ఆ విద్యలో పరిణతి సాధించాడు. అవునూ..! మరి, ఆ యువకుడు రూపొందించిన ఆవిష్కరణ ఏమిటి? అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ ఆవిష్కరణ ప్రత్యేకతలు ఏంటి? ఇలాంటి ఆలోచన అసలు ఎలా వచ్చింది? అనే విషయాన్ని ఆ ఆవిష్కర్త మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.