కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వేళ వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి : జాజాల సురేందర్ - కేసీఆర్ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 2:18 PM IST
Yellareddy BRS Candidate Jajala Surender Interview : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులనే ప్రచార అస్త్రంగా మలుచుకొని బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఎల్లారెడ్డి పరిస్థితి, బీఆర్ఎస్ వచ్చాక జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు చూడలేకనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని జాజాల సురేందర్ అన్నారు. పదేళ్ల అభివృద్ధి, బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అబివృద్ది పనులను చూసి ప్రజలు బీఆర్ఎస్కే ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందన్నారు. ఇక్కడి పథకాలు కేంద్రం కాపీ కొడుతుందని తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం తమ అదృష్టం అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గంలో ఉండేవారు కాదని.. ఎన్నికల వేళ వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.