ఘనంగా ఇల్లందు హజరత్ నాగుల్ మీరా ఉర్సు ఉత్సవాలు - ఇల్లందు వద్ద మౌలా చంద్ దర్గా ఉర్సు
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 4:45 PM IST
Yellandu Urs Festival Celebration : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మరోసారి సందడిగా సంప్రదాయ రీతిలో ఉర్సు ఉత్సవాలు జరిగాయి. ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో జరిగే ఇల్లందు హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్‌లో 21వ ఉర్సు ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల భక్తులతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా జరిగే ప్రదర్శనలో నాందేడ్ నుంచి ఫకీర్లు, దిల్లీ, మహారాష్ట్ర నుంచి మత పెద్దలు సంప్రదాయ రీతిలో పాల్గొనడం ప్రత్యేకతగా కొనసాగింది.
Hazrat Nagul Urs at Yellandu : భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తల్లెత్తకుండా దర్గా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంగళవారం పట్టణంలో హజరత్ ఖాసిం దుల్లా దర్గ షరీఫ్ నుంచి డప్పు, వాయిద్యాలు, కోలాటాలతో, కొమ్ము డప్పు కళాకారులు, గుర్రం బగీలు, ఒంటెలతో జులూస్ వివిధ రూపాలలో కళాకారులు ఆలరించారు. దేవుడు విగ్రహాలకు ఇల్లందు శివారు సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్‌లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ద్వారా వెళ్తున్న విగ్రహాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.