యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ - ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం - యాదాద్రి గుడి
🎬 Watch Now: Feature Video
Published : Dec 31, 2023, 1:29 PM IST
Yadadri Laxmi Narsimha Swamy Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఆలయానికి భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు ఒక గంట, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అరగంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాలు, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి తగ్గింది. ఫలితంగా ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులతో కిటకిటలాడే యాదాద్రీశుని సన్నిధిలో నేడు అంతగా సందడి లేదు.
Yadadri Temple : నూతన సంవత్సర వేడుకల వేళ ఆలయంలో భక్తుల సందడి తగ్గినట్లు తెలుస్తుంది. యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. అరగంటలోపే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు. స్వామివారికి నిత్యారాధనలు, కల్యాణపర్వం కన్నుల పండువగా జరిగింది. సుప్రభాతంతో మొదలైన ఆలయ కైంకర్యాలు, వేకువజామున మేల్కొలుపు నిర్వహించాక ప్రతిష్ఠామూర్తులకు ఆలయ అర్చకులు హారతి నివేదన జరిపారు. పాలతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చన చేశారు. స్వర్ణ పుష్పార్చనతో స్వామివారికి పూజలు నిర్వహించారు.