Womens beat fake Swamiji at Mahabubabad : నగ్న వీడియోలతో మహిళను బెదిరించిన స్వామీజీ.. బుద్ధి చెప్పిన మహిళలు - లగ్న ఫొటోలతో స్వామీజీ బెదిరింపులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18721178-514-18721178-1686395186359.jpg)
Swamiji threatened woman with nude photos at Mahabubabad : క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను లోబరుచుకొని నగ్న వీడియోలు, ఫోటోలు తీసి వేధింపులకు పాల్పడుతున్న నకిలీ స్వామీజీకి మహిళ సంఘాలు దేహశుద్ధి చేశాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బస్టాండ్ సమీపంలో అతన్ని పట్టుకుని మహిళలు చితకబాదారు. బాధితురాలు కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన మహిళ తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక స్వామీజీని ఆశ్రయించింది. ఇదే అదునుగా భావించిన స్వామీజీ పూజలు పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశాడు. అంతే కాకుండా ఆమెను మానసికంగా లోబరుచుకొని కొన్ని వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ తరువాత వాటితో ఆమెను బెదిరించాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత మహిళ హైదరాబాద్లోని మహిళా సంఘాలను ఆశ్రయించింది. వారు రంగంలోకి దిగి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్లో నకిలీ స్వామీజీ పట్టుకొని చితక బాదారు. అనంతరం నకిలీ స్వామీజీని స్థానిక పోలీసులకు అప్పగించారు. దీనిపై మాట్లాడిన బాదిత మహిళ తన వీడియోలు, ఫొటోలు తన దగ్గర ఉన్నాయని గత రెండు నెలలుగా బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.