స్మశానంలో ప్రేమికుల పెళ్లి.. ఘనంగా జరిపించిన వధువు తండ్రి - Lovers married in graveyard
🎬 Watch Now: Feature Video
Wedding In Graveyard : స్మశానంలో కూతురి పెళ్లిని ఘనంగా చేశాడు ఓ తండ్రి. ప్రేమించిన యువకుడితోనే కుమార్తె వివాహం జరిపించాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ వింత వివాహం జరిగింది. ఈ వేడుకకు బంధువులందరినీ ఆహ్వానించిన వధువు తండ్రి గంగాధర్.. సంప్రదాయబద్ధంగా వివాహ తంతును పూర్తి చేశాడు.
షిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్.. స్థానిక స్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తున్నాడు. మహాసంజోగి వర్గానికి చెందిన ఆయన.. చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి స్మశానంలోనే నివాసం ఉంటున్నాడు. తన కూతురు మయూరి కూడా అక్కడే ఉంటూ.. 12వ తరగతి వరకు చదివింది. షిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడ్ని మయూరి ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందుకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే మయూరి పెరిగిన చోటే.. ఆమె పెళ్లి చేయాలని గంగాధర్ నిశ్చయించుకున్నాడు. కూతురు పెళ్లికి సంబంధించిన అన్ని తంతువులు స్మశానవాటికలోనే పూర్తి చేశాడు. మయూరి, మనోజ్ పెళ్లికి హాజరైన బంధువులు, గ్రామస్థులు.. నూతన వధువరులకు ఆశీర్వదించారు. వారికి వివిధ రకాల కానుకలు అందజేశారు.