ప్రభుత్వం అందిస్తున్న ఆరు గార్యెంటీ పథకాల్లో దళారులకు చోటు లేదు - ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు - వర్ధన్నపేటలో ప్రజాపాలన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 8:08 PM IST

Wardhannapet MLA On Prajapalana : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఆరు గార్యెంటీల్లో దళారులకు స్థానం లేదని, ఎవరికీ లంచం ఇవ్వకూడదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని తప్పు చేసిన వారు సొంత కుటుంబ సభ్యులైనా, ఎవరినైనా విడిచిపెట్టే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై కేసు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  

MLA KR Nagaraju about Guarantees Schemes : ఆరు ప్రభుత్వ గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అధికారులు ప్రజల ఇంటివద్దకే తెచ్చి ఇస్తారని ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు అన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలను ఒకే దరఖాస్తు ద్వారా అందిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చామని, గత ప్రభుత్వంలో దళిత బంధులో దళారులు కమీషన్లు పంచుకున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అటువంటి తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా ప్రజల వద్దకే ప్రజా పాలన తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి ప్రజల పక్షాన ఎమ్మెల్యే నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.