Warangal medico student Lasya : నిద్రమాత్రలతో.. వరంగల్ వైద్యవిద్యార్థినికి అస్వస్థత
🎬 Watch Now: Feature Video
Warangal medico student Lasya : వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్ధిని లాస్య అస్వస్ధతకు గురైన ఘటన కలకలం రేపింది. హుటాహుటిన తోటి విద్యార్ధులు ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మైగ్రేన్ నొప్పితో బాధపడుతూ అధిక మోతాదు టాబ్లెట్లు తీసుకున్నందునే.. విద్యార్ధిని అస్వస్ధతకు గురైందని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన లాస్య కాకతీయ వైద్య కళాశాలలో పీజీ పీడియాట్రిక్స్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతోంది. తొలనొప్పి తీవ్రంగా రావడంతో దానికి సంబంధించి టాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకుని అపస్మారక స్ధితికి చేరుకుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని.. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వైద్యవిద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌దాస్ తెలిపారు. అస్వస్థకు గురైన లాస్య స్పందిస్తూ.. మైగ్రేన్ నొప్పికి తాను నిద్రమాత్రలను అధికమోతాదులో వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యానని పేర్కొన్నారు.