80 కేజీలు... 28 అడుగులు.. ఈ మహా పెన్నును చూశారా? - వరంగల్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

చదివింది ఎనిమిదో తరగతి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతే. ఏదైనా సాధించాలనే తపన మాత్రం మెండుగా ఉంది. ఆ సంకల్పమే 'వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు దక్కేలా చేసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్య గూడెం గ్రామానికి చెందిన కుదురుపాక జగదీశ్వర్.. 28 అడుగుల పెన్ను తయారు చేసి ఔరా అనిపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన జగదీశ్వర్.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మాని చిన్నప్పటి నుంచే వడ్రంగి, స్వర్ణ కార పనులలో ప్రావీణ్యం సాధించారు. ఓ పక్క పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటునే.. కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. ఈ పట్టాలేని ఇంజనీర్. ముందుగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి 3 లక్షల రూపాయలు నష్టపోవటంతో ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆపారు. అనంతరం పదేళ్ల క్రితం నర్సంపేటకు నివాసాన్ని మార్చిన జగదీశ్వర్ అక్కరకు రాని టేకు ముక్కలతో భారీ పెన్ను తయారు చేసి రికార్డు సృష్టించారు. 80 కిలోల బరువున్న ఈ కలం తయారికీ 25వేల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డు.. అవార్డును అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చేయాలనే తపన, ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే దానికి ఈయనొక గొప్ప నిదర్శనం.
TAGGED:
man made 80kg pen with wood