'ఓట్ల పండుగలో పాల్గొందాం - భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దాం' - వాకర్స్‌తో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 29, 2023, 1:05 PM IST
Voter Awareness in Hyderabad : పోలింగ్ పండుగ వేళయింది. మరి కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థలు సైతం తమవంతుగా అనేక రకాలుగా అవగాహన కల్పించాయి. ఈ నేపథ్యంలో అసలు ఓటరు మనసులో ఏముంది..? ఓటు హక్కును పై వారి అభిప్రాయం ఏమిటి? ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటే ఏం చేయాలని అనే అంశాలపై పలువురు హైదరాబాద్ మార్నింగ్ వాకర్స్ మాటల్లోనే విందాం రండి..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని మార్నింగ్ వాకర్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును ఓటు కల్పిస్తుందని.. అలాంటి ఓటును దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇచ్చే తాయిలాలకు లొంగకుండా నిజాయితీతో తమకు సరైన పరిపాలన అందించేవారికి ఓటు వేసినట్లైతే భవిష్యత్తు తరాలు ఎంతో బాగుంటాయని అన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. కొందరు ఓటును వినియోగించుకోలేదని.. ఈసారి తప్పకుండా ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు అంటే పండగలా బావించి అందరూ ఈ పండుగలో భాగస్వామ్యం కావాలని కోరారు. సరైన నాయకులకు ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే దేవాలయాన్ని కాపాడుకోవాలని అన్నారు.