మహిళను గదిలో బంధించి పోలీస్ దౌర్జన్యం - యూపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పోలీసు ఆధికారి ఓ మహిళ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాడు. కాన్పుర్‌లో ఓ మహిళను గదిలో బంధించాడు. అనంతరం ఆమె చేతులను వెనక్కితిప్పి ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ మహిళ బయట ఉన్న వారి నుంచి సహాయం కోసం కేకలు వేసింది. ఈ ఘటనను ఆ మహిళ కుటుంబసభ్యులు మొబైల్లో వీడియో తీశారు. దీనిని సమాజ్‌వాద్ పార్టీ నేతలు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కాన్పుర్ కమిషనర్ బిపి జోగ్దండ్ ఈ ఘటన కక్వాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిపారు. పూర్తి విచారణ చేపడతున్నట్లు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST