Violation Of Election Code In Miryalaguda : మిర్యాలగూడలో ఎన్నికల కోడ్‌కు ముసుగేసిన మున్సిపాలిటీ అధికారులు..
🎬 Watch Now: Feature Video
Violation Of Election Code In Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపాలిటీ అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా మిర్యాలగూడలోని ప్రధాన కూడళ్లలోని వివిధ రాజకీయ పార్టీలకు దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పార్టీలకు చెందిన జెండాలు, ఫ్లెక్సీలు ఉండకూడదని, జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగువేయాలని నిబంధన ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
Muncipality Ignoring Election Commission Rules : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 24 గంటలు దాటినా రోడ్లపై ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు ముసుకుగు కప్పలేదు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రజానీకం విస్తుపోతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా విగ్రహాలకు ముసుగులు ఏర్పాటు చేయకపోవడం ఏంటని... ఇప్పుడే ఇలా వ్యవహరిస్తే ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎలా నిర్వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అధికారులపై ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.