Vinayakanagar Colony Submerged in Medchal : చెరువు నిండిందని నీళ్లు వదిలారు.. పక్కనే కాలనీ ఉన్న సంగతి మరిచారు.. - Medchal District Latest News
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2023, 4:15 PM IST
Vinayakanagar Colony Submerged in Medchal : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని వినాయకనగర్ కాలనీ జలామయంగా మారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీకి.. కుడి వైపు ఉన్న ఎర్ర చెరువులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. చెరువులోకి సామర్థ్యానికి మించి నీరు చేరడంతో.. మున్సిపల్ అధికారులు తూము గుండా నీటిని బయటకు విడుదల చేశారు.
Heavy Rains in hyderabad : దీంతో పక్కనే ఉన్న వినాయకనగర్ కాలనీలోకి భారీగా వరద వచ్చి చేరడంతో.. కాలనీ మొత్తం నీట మనిగింది. చెరువు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు.. మున్సిపల్ అధికారులు తమకు చెప్పకుండానే నీటిని వదిలారని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమని ముందే హెచ్చరించినట్లుయితే.. ఏమైనా ముందు జాగ్రత్త పడేవారమని పేర్కొంటున్నారు. ఇప్పుడు కాలనీలో అన్ని ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో.. ఎటు పోవాలో తెలియడం లేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. నీటిని తోడే యంత్రాలను ఉపయోగించి.. వరదనీటిని మరోవైపుకు మళ్లించాలని కోరుకుంటాన్నారు.