ఈ ఆచారం మీకు తెలుసా.. ఉగాది పచ్చడితో పాటు మందు, చికెన్.. - ugadhi 2023
🎬 Watch Now: Feature Video
Ugadi celebrations at Motkur in Yadadri Bhuvanagiri: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదినాన్ని షడ్రుచులతో జరుపుకుంటే మోత్కురు లో మత్రం నాన్ వెజ్‌తో ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. యాదాద్రి భువనగిరి మోత్కూరు మున్సిపాలిటీలో ఉగాది వేడుకలను ప్రత్యేక తరహాలో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా షడ్రురుచుల ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసాలు, ముత్యాలమ్మలకు బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదర్శనలతో ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలను నిర్వహించడం ఇక్కడి ఆనవాతీ.
సుమారు వందేళ్లకు పైగా మోత్కూర్‌లో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. పూర్వం మోత్కూరులో వేసవిలో పెద్ద ఎత్తున ప్రజలకు అమ్మవారు సోకి చనిపోయేవారు. గ్రామంలో తూర్పున, పడమర కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురి అయినందునే ప్రజలు అమ్మవారు సోకి చనిపోతున్నారని గ్రామ పెద్దలు భావించారు. దీంతో ఉగాది పర్వదినం రోజున ఊరంతా ముత్యాలమ్మలకు చలి బోనాలు చేసి, జంతుబలి ఇచ్చి అమ్మవార్లకు శాంతించినందున గ్రామంలో ఒక్కసారిగా అమ్మవారు మాయమైపోయిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అందువల్ల ఆనాటి నుంచి నేటి వరకు ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.