మొదలైన సంక్రాంతి సందడి - కీసర టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు - సంక్రాంతి రష్
🎬 Watch Now: Feature Video
Published : Jan 11, 2024, 4:45 PM IST
Vijayawada to Hyderabad National Highway Sankranthi Rush: ఆంధ్రుల ముఖ్య పండగగా జరుపుకొనే సంక్రాంతి రానే వచ్చేసింది. చిన్నా పెద్దా అంతా కలిసి రంగవల్లులు, పిండివంటలు, ఆటపాటలతో ఉత్సాహంగా ఈ పండగను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఉన్న ఆంధ్రులైనా సంక్రాంతికి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని పండగను నిర్వహించుకుంటారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్లో నివాసం ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనం అవ్వడంతో వాహనాలతో రద్దీ పెరిగింది. దీంతో కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల టోల్గేట్ దగ్గర జాప్యం జరుగుతోంది. మరోవైపు టోల్గేట్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తుండటం వల్ల మరింత జాప్యం జరుగుతోంది.