తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారు : విజయశాంతి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 27, 2023, 5:35 PM IST
Vijayashanti Roadshow in Ibrahimpatnam : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. కేసీఆర్ నుంచి కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని కాంగ్రెస్ నేత విజయశాంతి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి మద్ధతుగా ఇబ్రహీంపట్నంలో రోడ్‌షో నిర్వహించారు. చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Congress Election Campaign : రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని.. నలుగురు వ్యక్తుల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమయ్యిందని కాంగ్రెస్ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నీరుగార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలో బీఆర్ఎస్ విఫలమయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్.. అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. అందరి భవిష్యత్ మారాలంటే తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ పార్టీ పథకాల రూపకల్పన చేసిందన్నారు.