100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం : విజయశాంతి - congress election campaign
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 5:46 PM IST
Vijayashanthi Election Campaign in Warangal : కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయమని.. కేసీఆర్కు ఓటేస్తే.. మోదీకి వేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. హన్మకొండలోని కుమార్ పల్లి రోడ్ షోలో పాల్గొన్న విజయశాంతి కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ ప్రాజెక్టుల పేరిట రూ. వేల కోట్లు దోచుకున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత ప్రమాణాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు దెబ్బతిందని గుర్తుచేశారు.
పేపర్ లీకేజీల ద్వారా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. పథకాల పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరుకాదని తెలిపిన విజయశాంతి.. లిక్కర్ కేసులో చీకటి ఒప్పందాలు బహిర్గతం అయిన్నట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. ఈ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఓరుగల్లు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.