Variety Palabhishekam To KCR Cut Out in Hyderabad : కేసీఆర్​ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. 50 అడుగుల కటౌట్​ ఏర్పాటు చేసి పాలాభిషేకం - బేహంబజార్​లో కేటీఆర్​ కటౌట్​కు పాలాభిషేకం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 7:08 PM IST

Variety Palabhishekam To KCR Cut Out in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. హ్యాట్రిక్​ విజయం కోసం విపక్షాలను ఎదుర్కోవడానికి కేసీఆర్​ సర్కార్​ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో బీఆర్​ఎస్​ నేతల్లో జోష్​ పెరిగి సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ కటౌట్​లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బేగంబజార్​లో గోశామహల్ నియోజకవర్గం బీఆర్​ఎస్​ నాయకురాలు మమత సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల 50 ఫీట్ల భారీ కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, రైతు రుణమాఫీ, మెట్రో విస్తరణ, అనాథల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై బీఆర్​ఎస్​ కార్యకర్తలు సంబురాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. గోశామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని.. మమత సంతోష్ గుప్తా స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం హ్యాట్రిక్​ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.