భద్రాద్రిలో ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 4:20 PM IST
Vaikuntha Ekadashi Festival at Bhadradri : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజైన నేడు భద్రాద్రి రామయ్య, నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు వచ్చిన స్వామి వారు నరసింహ అవతారాన్ని ధరించి విశేష పూజలు అందుకుంటున్నారు. బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని ప్రధాన ఆలయంలోనికి తీసుకువెళ్లి మహా నివేదన అందించారు.
Bhadrachalam Mukkoti utsavalu : మహా నివేదన అనంతరం స్వామి వారు మంగళ వాయిద్యాలు కోలాటం నృత్యాలు, వేద మంత్రాలు భక్తుల కోలాహల ఆనంద కేరింతల నడుమ సకల రాజ లాంఛనాలతో తిరువీధి సేవకు బయలుదేరుతారు. వివిధ అవతారాలలో దర్శనమిస్తున్న స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రి ఆలయానికి కదిలి వస్తున్నారు. నరసింహావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల అన్ని గ్రహబాధలు తొలగిపోతాయని ఆలయ వేద పండితులు తెలిపారు.