ETV Bharat / entertainment

షారుక్‌ ఖాన్‌ కొడుకు ఎంట్రీకి రంగం సిద్ధం - కానీ హీరో కాదు - SHAH RUKH KHAN SON AS DIRECTOR

డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌.

Shah Rukh Khan Son As Director
Shah Rukh Khan Son As Director (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 9:48 PM IST

Shah Rukh Khan Son As Director : బాలీవుడ్‌ స్టార్​ హీరో, బాద్​ షా షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) పరిచయానికి రంగం సిద్ధమైంది. అతడు దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు.

అయితే సినిమా కోసం కాదు గానీ వెబ్‌ సిరీస్‌ కోసం అతడు తొలి సారి మెగా ఫోన్‌ పట్టాడు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు షారుక్‌ ఖాన్. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశాయి.

"బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ చూడని సరికొత్త వెబ్‌ సిరీస్‌ను మీకు అందించనున్నాం. 2025లో ఈ సిరీస్‌ రిలీజ్ అవుతుంది" అని తెలిపాయి. కాగా, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్​ స్ట్రీమింగ్‌ కానుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సినీ నేపథ్యంలేని ఓ వ్యక్తి యాక్షన్, డ్రామా, కామెడీ, ఇలా పలు అంశాలు ఈ సిరీస్‌లో ఉంటాయని పేర్కొన్నాయి. షారుక్‌ ఖాన్, రణ్‌బీర్‌ కపూర్​, రణ్‌వీర్‌ సింగ్​, బాబీ దేవోల్‌ తదితరులు అతిథి పాత్రల్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఈ సిరీస్‌కు స్టార్‌ డమ్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

ప్రభాస్, హను రాఘవపూడి 'ఫౌజీ' అప్డేట్ - షూటింగ్​ ఎక్కడి వరకు వచ్చిందంటే?

'ప్రభాస్​, బాలకృష్ణ విషయంలో నిర్ణయం తీసుకుంటాం' - హీరో రానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.